పోలీసు శాఖ ఆధ్వర్యంలో శిక్షణా కేంద్రాలు
NEWS Dec 30,2024 09:10 am
త్వరలోనే రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి వంగలపూడి అనిత. టెక్నాలజీలో చోటు చేసుకున్న మార్పులకు అనుగుణంగా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. పోలీస్, అగ్నిమాపక సేవలు, జైళ్లు, విపత్తు నిర్వహణ, జిల్లా సైనిక సంక్షేమానికి సంబంధించిన కేంద్ర పథకాల నిధులు రావాల్సి ఉందన్నారు.