అనాధ మహిళకు దహన సంస్కారాలు చేసిన మున్సిపల్ సిబ్బంది
NEWS Dec 30,2024 01:14 pm
మెట్‌పల్లి: కోనేరులో పడి చనిపోయిన అనాధ మహిళకు మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో సోమవారం దహన సంస్కరణ నిర్వహించారు. గత 8 ఏళ్లుగా మెట్‌పల్లిలోని నాగులపేటకు చెందిన 30 ఏళ్ల రజిత అనే మహిళ బిక్షటన చేస్తూ జీవనం సాగిస్తుండేది. చెన్నకేశవ ఆలయ ఎదురుగా ఉన్న కోనేరులో చనిపోయి ఉండటాన్ని ప్రజలు గమనించి పోలీస్ వారికి సమాచారం చేయగా ఎస్సై కిరణ్ కుమార్ సలహా మేరకు మున్సిపల్ కమిషనర్ టి. మోహన్ ఆదేశాలతో మున్సిపల్ సిబ్బందితో దహన సంస్కారాలు చేశారు.