ఎన్నో సవాళ్లను అధిగమించాం
NEWS Dec 30,2024 08:09 am
ఈ ఏడాది పోలీస్ శాఖ ఎన్నో సవాళ్లను అధిగమించిందని అన్నారు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజ శేఖర్ బాబు. పోలీస్ శాఖ అద్భుతమైన పనితీరు కనబర్చిందని, అనేక సంస్కరణలను తీసుకు వచ్చామని చెప్పారు. ఇంకా చాలా గమ్యాలను చేరుకోవాల్సి ఉందన్నారు. అస్త్రం యాప్ తో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించామన్నారు. భవానీ దీక్షలకు ఇబ్బంది లేకుండా చేశామన్నారు.