మహా కుంభమేళకు ప్రత్యేక రైళ్లు
NEWS Dec 30,2024 05:43 am
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మహా కుంభమేళకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే ప్రకటించింది. ఏపీకి చెందిన భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. జనవరి 10 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు యూపీలో మహా కుంభ మేళ నిర్వహించనున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 3 వేల రైళ్లు నడపనుంది రైల్వే శాఖ.