మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ప్రకటించాలి
NEWS Dec 30,2024 05:31 am
దివంగత, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు భారత రత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి మన్మోహన్ సింగ్ ఆత్మ బంధువు అని అన్నారు. తెలంగాణతో ఆయనకు ఎనలేని బంధం ఉందన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజానీకం తమ గుండెల్లో పెట్టుకుందన్నారు. సింగ్ మరణం దేశానికి తీరని లోటు అన్నారు. శాసన సభలో సింగ్ మృతికి సంతాపం ప్రకటించారు.