బీహార్ సర్కార్ పై ప్రియాంక కన్నెర్ర
NEWS Dec 30,2024 05:08 am
విద్యార్థులపై బీహార్ సర్కార్ ఉక్కుపాదం మోపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ ప్రియాంక గాంధీ. మూడు రోజుల వ్యవధిలో విద్యార్థులపై దాడులకు దిగడం దారుణమన్నారు. పరీక్షల్లో అవినీతి, రిగ్గింగ్, పేపర్ లీక్‌లను అరికట్టడంలో విఫలమైందని ప్రశ్నించిన విద్యార్థులపై లాఠీఛార్జి చేయడం, వాటర్ క్యాన్లు ఉపయోగించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు.