ఏపీ నూతన సీఎస్ గా విజయానంద్
NEWS Dec 30,2024 03:50 am
ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ ను నియమించారు. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం ఈనెలాఖరుతో ముగియనుంది. విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.1992 బ్యాచ్ కు చెందిన ఆయన ఎన్నో పదవులు నిర్వహించారు. పలు జిల్లాలకు కలెక్టర్ గా , జెన్ కోకు ఎండీగా, ప్రధాన ఎన్నికల అధికారిగా పని చేశారు.