జగన్ హయాంలోనే విద్యుత్ భారం
NEWS Dec 29,2024 01:09 pm
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ భారం మోపారని ఆరోపించారు. జగన్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున దోచుకున్నారని అన్నారు. మెజారిటీ రాష్ట్రాలు విద్యుత్ మీటర్లు బిగించేందుకు ఒప్పుకోలేదని, కానీ మాజీ సీఎం లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. సిగ్గు లేకుండా వైసీపీ శ్రేణులు ధర్నా చేయడం దారుణమన్నారు.