పేరెంట్స్ కోసం పోలీస్ హ్యాండ్ బుక్
NEWS Dec 29,2024 12:16 pm
తెలంగాణ సైబర్ బ్యూరో ఆధ్వర్యంలో పిల్లల పేరెంట్స్ కోసం రూపొందించిన హ్యాండ్ బుక్ ను విడుదల చేశారు డీజీపీ జితేందర్. చిన్నారుల నుంచి పెద్దల దాకా సైబర్ బారిన పడుతున్నారని అన్నారు. ప్రత్యేకంగా పిల్లలను అసాంఘిక శక్తులు, సైబర్ మోసాల నుంచి కాపాడేందుకు గాను దీనిని రూపొందించడం జరిగిందని స్పష్టం చేశారు. డిజిటల్ స్పేస్ నుంచి ఎలా తమను తాము రక్షించు కోవాలో దీనిని చూసి నేర్చుకోవచ్చన్నారు.