కవితకు గజమాలతో బీఆర్ఎస్ శ్రేణుల స్వాగతం
NEWS Dec 29,2024 05:46 pm
నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత గజమాలతో ఘనస్వాగతం లభించింది.ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్టై తిహార్ జైలుకు వెళ్లిన కవిత కొన్ని నెలల తరువాత జైలు నుంచి విడుదలయ్యారని తెలిసిందే. జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి కవిత ఇందూరు పర్యటనకు రావడంతో బీఆర్‌ఎస్ నేతలు, జాగృతి నాయకులు కవితకు గ్రాండ్ వెల్కమ్ పలికారు.