బండి సంజయ్ ని కలిసిన గెజిటెడ్ అధికారులు
NEWS Dec 29,2024 07:49 am
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సిరిసిల్ల జిల్లా సంఘం సభ్యులు కేంద్రమంత్రి బండి సంజయ్ ని కరీంనగర్ లోని రేకుర్తి హనుమాన్ ఆలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో ఘనంగా సత్కరించారు. బండి సంజయ్ సభ్యులందరినీ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగుల వెంట తను ఎప్పుడు ఉంటానని భరోసా ఇచ్చారు. సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.