Logo
Download our app
ముదిరాజ్‌లు రాజకీయంగా చైతన్యం కావాలి
NEWS   Dec 29,2024 05:39 am
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న ముదిరాజ్‌ కులస్తులు రాజకీయంగా చైతన్యం కావాలని తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చొప్పరి శంకర్‌ ముదిరాజ్‌ పిలుపునిచ్చారు. డిచ్‌పల్లి మండలం బర్ధిపూర్‌ శివారులోని హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జనాభాలో 14.7 శాతం ఉన్న ముదిరాజ్‌ లకు చట్టసభల్లో, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎలాంటి లబ్ధి చేకూరడం లేదన్నారు. ఇతర బీసీ కులాల వారితో కలిసి ముదిరాజ్‌లు రాజకీయంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source