ఎయిర్‌పోర్టులో ఘోర విమాన ప్రమాదం
NEWS Dec 29,2024 02:40 am
దక్షిణ కొరియాలోని ముయాన్ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రన్‌వేపై అదుపు తప్పి గోడను ఢీకొట్టింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో 175 మంది ప్రయాణీకులతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో 28 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి కారణాలు ఇంకా తెలియ రాలేదు.