రాజధాని అమరావతికి పూర్వ వైభవం
NEWS Dec 29,2024 02:15 am
అమరావతికి పూర్వ వైభవం తీసుకు వస్తామని స్పష్టం చేశారు మంత్రి పొంగూరు నారాయణ. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సెంట్రల్ జోన్ డైరీని ఆవిష్కరించారు. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని జగన్ రెడ్డి భ్రష్టు పట్టించారని ఆరోపించారు. తాము వచ్చాక ఏపీని అభివృద్ది చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగానికి తిరిగి ఊపు తీసుకు వస్తామన్నారు.