డీజీపీపై బొత్స షాకింగ్ కామెంట్స్
NEWS Dec 28,2024 07:48 pm
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ డీజీపీ తమ ఫోన్ ఎత్తాలంటే భయపడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. కడప పర్యటనలో వార్నింగ్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ ముందు సెక్యూరిటీ లోపంపై ఏం సమాధానం చెబుతారంటూ ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో కూటమి సర్కార్ ఉందా లేక నిద్ర పోతోందా అంటూ ఎద్దవా చేశారు.