190 కొత్త 108 వాహనాల కొనుగోలు
NEWS Dec 28,2024 07:37 pm
వైద్య రంగానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇకపై 108, 104 సేవలకు సింగిల్ సర్వీస్ ప్రొవైడర్ ను ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో 190 కొత్తగా 108 వాహనాలను కొనుగోలు చేస్తామన్నారు. 108 సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా రూ. 4 వేలు పెంచుతున్నట్లు ప్రకటించారు. 58 మహా ప్రస్థానం వాహనాలు తీసుకు వస్తామన్నారు. ప్రతి మండలంలో జన ఔషధి స్టోర్ ఏర్పాటు చేస్తామన్నారు.