చోరీ చేస్తే చూస్తూ ఊరుకుంటారా..?
NEWS Dec 28,2024 07:21 pm
మంత్రి కొల్లు రవీంద్ర సీరియస్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి పేర్ని నానిపై భగ్గుమన్నారు. రేషన్ బియ్యం స్కాం కేసుకు సంబంధించి కూటమి సర్కార్ కావాలని కక్ష సాధింపులకు పాల్పడుతోందంటూ ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. తప్పు చేయక పోతే ఎందుకు నెల రోజులుగా తప్పించుకు తిరిగావో చెప్పాలన్నారు. చోరీ చేస్తే చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నించారు.