నితీష్ కుమార్ రెడ్డికి సీఎం కంగ్రాట్స్
NEWS Dec 28,2024 07:09 pm
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో భారత జట్టు తరపున ఆడిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన సెంచరీ సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం తరపున భారీ నజరానా ప్రకటించారు. రూ. 25 లక్షలు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరపున అందజేస్తామన్నారు. రాబోయే రోజుల్లో జట్టుకు మరింత పేరు తీసుకు రావాలని కోరారు.