మల్లాపూర్ ఎస్సైకి ప్రశంసా పత్రం
NEWS Dec 28,2024 04:59 pm
జగిత్యాల జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయంలో అన్ని పోలీస్ స్టేషన్ల పనితీరుపై ఎస్పీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 2024 సంవత్సరంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మల్లాపూర్ ఎస్సై రాజుకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మెట్‌పల్లి సీఐ నిరంజన్ రెడ్డి, పలువురు నాయకులు, అధికారులు ఎస్సైకి అభినందనలు తెలిపారు.