విద్యుత్ భారం జగన్ రెడ్డిదే పాపం
NEWS Dec 28,2024 12:58 pm
విద్యుత్ ఉత్పత్తి సంస్థలను నిర్వీర్యం చేసిన చరిత్ర జగన్ రెడ్డిదేనని అన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. విద్యుత్ కొనుగోలు పేరుతో హిందూజాకి రూ.1400 కోట్లు ముట్టజెప్పారని, కేపీహెచ్పీలో 10 ఎకరాలను జగన్ బినామీలు కొట్టేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. విద్యుత్ రంగంలో రూ.50 వేల కోట్ల అప్పులు తమ మీద మోపారంటూ వాపోయారు. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక పోతున్నామన్నారు.