నేను ఎక్కడికీ పారిపోలేదు
NEWS Dec 28,2024 12:26 pm
అరెస్ట్ చేస్తారనే భయంతో తాము పారి పోయినట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు మాజీ మంత్రి పేర్ని నాని. తాము ఎక్కడికీ పారి పోలేదన్నారు. బాజాప్తాగా మాట్లాడుతూనే ఉన్నామని చెప్పారు. కావాలని కక్ష సాధింపుతో కేసులు నమోదు చేస్తున్నారంటూ వాపోయారు. అమాయకురాలైన తన భార్య జయసుధను చిత్రహింసలకు గురి చేయడం సబబు కాదన్నారు నాని.