హైకోర్టులో కేటీఆర్ అఫిడవిట్
NEWS Dec 28,2024 11:27 am
ఫార్ములా ఈ కారు రేస్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఒప్పందాల అమలు, డబ్బులతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. విధానపరమైన అంశాలు చూసే బాధ్యత తనది కాదన్నారు. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై పంపిణీ వ్యవహారం అంతా సంబంధిత బ్యాంక్ దేనని స్పష్టం చేశారు. కావాలని సర్కార్ తనపై కక్ష కట్టిందని, కేసు నమోదు చేసిందని ఆరోపించారు.