Logo
Download our app
అధికారుల‌పై దాడి చేస్తే తోలు తీస్తాం
NEWS   Dec 28,2024 10:57 am
ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఎంపీడీఓ జ‌వ‌హ‌ర్ బాబుపై వైసీపీ నేత‌లు దాడి చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు. అధికారుల‌పై దాడి చేయ‌డం వారికి కొత్తేమీ కాద‌న్నారు. ఇది వైసీపీ రాజ్యం అనుకుంటున్నార‌ని, కానీ ఇక చెల్ల‌ద‌న్నారు. అహంకార పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఫైర్ అయ్యారు. ఇక నుంచి ఎవ‌రు దాడికి పాల్ప‌డినా తోలు తీస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం.
⚠️ You are not allowed to copy content or view source