నమస్కారం పెడితే దుష్ప్రచారం చేస్తారా
NEWS Dec 28,2024 10:28 am
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు సంస్కారంతో నమస్కారం పెట్టానని, దానిని కూడా రాజకీయం చేస్తే ఎలా అని ప్రశ్నించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. రాజకీయాలకు అతీతంగా చూడాలని సూచించారు.