నకిలీ ఐపీఎస్ హల్ చల్ పై సీరియస్
NEWS Dec 28,2024 08:46 am
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్ చల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి వంగలపూడి అనిత. భద్రతా లోపాలపై ఫైర్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జెడ్ కేటగిరీ భద్రత కల్పించినా ఎలా లోపలికి వచ్చాడని ప్రశ్నించారు. సెక్యూరిటీ లోపాలపై ఫైర్ అయ్యారు.