Logo
Download our app
పరిసరాలను శుభ్రం చేయాలని కోర్టు శిక్ష
NEWS   Dec 28,2024 05:35 am
బోధన్ పట్టణంలో 8 మంది నిందితులకు ఒకరోజు కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్ లో భాగంగా కోర్టు ఆవరణలో పరిసరాలను శుభ్రం చేయించారు.బోధన్ పట్టణంలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ముగ్గురు యువకులు, రాకాసిపేట్ లోని గోసంగి కాలనీలో గొడవపడిన కేసులో 5గురు వ్యక్తులను బోధన్ ఎస్హెచ్ఓ వెంకట్ నారాయణ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శేషతల్పసాయి ముందు 8 మందిని హాజరుపరచడంతో మేజిస్ట్రేట్ వారికి ఒకరోజు కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్ కింద కోర్టు ఆవరణలో పరిసరాలను శుభ్రం చేయాలని కోర్టు ఆదేశించింది.
⚠️ You are not allowed to copy content or view source