మన్మోహన్ జీవితమే ఓ సందేశం
NEWS Dec 27,2024 12:19 pm
డాక్టర్ మన్మోహన్ సింగ్ జీవితమే ఓ సందేశమని, అత్యంత స్పూర్తి దాయకమైన రాజకీయ నేతలలో తను ఒకరని నివాళులు అర్పించారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. దేశాన్ని సంక్షోభం దిశ నుంచి అభివృద్ది వైపు పరుగులు తీసేలా చేసిన గొప్ప రాజకీయవేత్త అని కొనియాడారు. ఆయన లేని లోటు తీర్చ లేనిదని అన్నారు.