మన్మోహన్ కు పోచారం నివాళులు
NEWS Dec 27,2024 12:01 pm
భారత దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాళులు అర్పించారు. బాన్సువాడ నివాసంలో, బీర్కూర్ మండల కేంద్రంలోని గాంధి చౌక్ వద్ద స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.