మన్మోహన్ సింగ్ కు చంద్రబాబు నివాళి
NEWS Dec 27,2024 11:36 am
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు సీఎం చంద్రబాబు నాయుడు. సింగ్ భౌతిక కాయానికి పుష్పగుచ్ఛ ఉంచి అంజలి ఘటించారు. కుటుంబీకులకు సంతాపం తెలిపారు. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు అన్నారు. లెక్చరర్ నుంచి ప్రధాని వరకు సాగిన ప్రస్థానం స్ఫూర్తిదాయకమని చెప్పారు. భారత నిర్మాణంలో మన్మోహన్ సింగ్ ది కీలక పాత్ర అని స్పష్టం చేశారు.