సంతాపం తెలిపిన జువ్వాడి కృష్ణారావు
NEWS Dec 27,2024 11:56 am
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్‌లో జరిగిన సంతాప సభలో మాట్లాడుతూ.. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా చేసిన సేవలు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ఆర్థిక పటిష్ట భారత్ గా రూపాంతరం చెందడానికి కారకులయ్యారని ఆ తర్వాత ప్రధానిగా పదేళ్లపాటు దేశానికి సేవ చేశారని కొనియాడారు.