ప్రాతః స్మరణీయుడు మన్మోహన్ సింగ్
NEWS Dec 27,2024 10:16 am
మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అజాత శత్రువు అని కొనియాడారు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సింగ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దేశ చరిత్ర గతిని మార్చిన నేతలలో తను కూడా ఒకరు అని పేర్కొన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు. సింగ్ నిత్య ప్రాతః స్మరణీయుడంటూ కితాబు ఇచ్చారు.