తిరుమలలో తెలంగాణ భక్తులపై నిర్లక్ష్యం
NEWS Dec 27,2024 08:40 am
తిరుమలకు వస్తున్న తెలంగాణ భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి కొండా సురేఖ. భక్తుల మీద ప్రత్యేక దృష్టి సారించి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ విషయంపై ప్రస్తుత టీడీపీ కూటమి సర్కార్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందన్నారు కొండా సురేఖ.