వైసీపీకి ధర్నా చేసే హక్కు లేదు
NEWS Dec 27,2024 08:17 am
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆందోళన చేసే హక్కు వైసీపీకి లేదన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. జగన్ రెడ్డి హయాంలోనే పదిసార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని ఆరోపించారు. తాము పెంచింది కాక బట్ట కాల్చి తమ మీద వేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలు వైసీపీ జిమ్మిక్కులను, జగన్ రెడ్డి కపట నాటకాలను నమ్మే స్థితిలో లేరన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.