ఆర్థిక శిల్పి మన్మోహన్ సింగ్
NEWS Dec 27,2024 07:11 am
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి ఎస్. సవిత.
ఆర్థిక మేధావి కన్నుమూత దేశానికి తీరనిలోటు అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి వైపు పరుగులు పెట్టించిన ఆర్థిక శిల్పి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి పేదలకు అండగా నిలిచారని ప్రశంసించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.