మన్మోహన్ సింగ్ కు పీఎం నివాళి
NEWS Dec 27,2024 06:57 am
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. భౌతిక కాయం వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాతో పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.