మన్మోహన్ సింగ్ లెజెండ్
NEWS Dec 27,2024 06:08 am
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేటి తరానికే కాదు రాబోయే తరాలకు స్పూర్తిదాయకంగా నిలుస్తారని అన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు. దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన నేతగా గుర్తుండి పోతారని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నానని అన్నారు.