పూడ్చలేని అగాధం..బాధాకరం
NEWS Dec 27,2024 04:47 am
డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ సోనియా గాంధీ. తమ కుటుంబం గొప్ప నాయకుడిని, ఆత్మీయుడిని, మానవతావాదిని కోల్పోయిందని వాపోయారు. సమగ్రత, సానుకూలత, నిరాడంబరత, వినయం అన్నింటికి మించి అద్భుతమైన ప్రజ్ఞా పాటవాలు సింగ్ స్వంతమని, అలాంటి నేతలు అరుదుగా ఈ నేలపై జన్మిస్తుంటారని గుర్తు చేసుకున్నారు. తనకు మాటలు రావడం లేదని కన్నీటి పర్యంతం అయ్యారు.