రాజకీయ దిగ్గజం మన్మోహన్ సింగ్
NEWS Dec 27,2024 03:59 am
దేశం గర్వించదగిన రాజకీయ నేతలలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకరు అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఆయనతో తనకు ఎనలేని అనుబంధం ఉందన్నారు. ఎంపీగా ఉన్న సమయంలో తాను మాజీ పీఎం నుంచి ఎన్నో నేర్చుకున్నానని గుర్తు చేసుకున్నారు. ఒక రకంగా ఆత్మీయుడిని, మార్గదర్శిని కోల్పోయానని వాపోయారు. నివాళిగా 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.