దేశానికి తీరని లోటు
NEWS Dec 27,2024 03:23 am
మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్ను మూయడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. ఆయన మృతి దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు. దేశం గర్వించ దగిన నేతను కోల్పోవడం బాధాకరమని అన్నారు. చివరి దాకా విలువలకు కట్టుబడిన నాయకుడిగా ఆయన పేర్కొన్నారు.