Logo
Download our app
జాతీయ స్థాయి ఫిస్ట్‌బాల్‌కు ఎంపిక
NEWS   Dec 26,2024 06:45 pm
జక్రాన్‌పల్లి మండలంలోని పడకల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి ఫిస్ట్‌ బాల్‌ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.జాతీయ సబ్‌ జూనియర్‌ ఫిస్ట్‌బాల్‌ పోటీలకు యాటకర్ల శివరామకృష్ణ, బదావత్‌ విష్ణువర్ధన్‌, విస్లావత్‌ కల్యాణి, ఈర్ల జగదీశ్వరి, సీనియర్‌ విభాగంలో బోండ్ల సలోని, బోండ్ల తేజ ఎంపికయ్యారు. బోయిన్‌పల్లిలోని కంటోన్మెంట్‌ గ్రౌండ్‌లో ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభకనబర్చారన్నారు.
⚠️ You are not allowed to copy content or view source