జగన్ విసిరిన ఫిరంగి రోజా
NEWS Dec 26,2024 10:12 am
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ కూటమి సర్కార్ పై ధ్వజమెత్తారు. నగరిలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి ఆర్కే రోజాపై ప్రశంసలు కురిపించారు. కూటమి సర్కార్ పై జగన్ రెడ్డి విసిరిన ఫిరంగి రోజా అని పేర్కొన్నారు. జగన్ మరోసారి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, చిత్తూరు జిల్లాలో రాబోయే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామన్నారు భూమన.