28న డయల్ యువర్ ఈవో
NEWS Dec 26,2024 09:51 am
టీటీడీ డయల్ యువర్ ఈవో కార్యక్రమం డిసెంబరు 28వ తేదీ ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో జె.శ్యామలరావుకు ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు 0877-2263261 అనే నెంబర్ లో సంప్రదించాలని టీటీడీ సూచించింది.