వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం శీతకన్ను
NEWS Dec 26,2024 09:26 am
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెప్తున్నవన్నీ అసత్యాలేనని అన్నారు. స్టీల్ ప్లాంట్ మీద కేంద్రానికి ఉండేది ఎన్నటికీ సవతి తల్లి ప్రేమనేంటూ మండిపడ్డారు. కన్నడ ఉక్కు మీదున్న ప్రేమ మోడీకి ఆంధ్రుల హక్కు మీద లేదని ఆరోపించారు. విశాఖ స్టీల్ ను దివాలా తీయించే ఎత్తుగడలు సాగుతూనే ఉన్నాయని వాపోయారు.