అల్లు అర్జున్..రాణా సూపర్ స్టార్లు
NEWS Dec 26,2024 09:13 am
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నటులు అల్లు అర్జున్, దగ్గుబాటి రాణా లాంటి వారి పట్ల తనకు ఎలాంటి కోపం లేదని అన్నారు . ఆ ఇద్దరూ సూపర్ స్టార్లు అని, వారు తమకు గర్వ కారణమని కొనియాడారు. వాళ్లంతా తమ ముందు పెరిగిన వారేనని చెప్పారు. ఎలాంటి కోపం కానీ అంతకు మించిన ద్వేషం లేదన్నారు. సినీ పరిశ్రమ ఎక్కడికీ వెళ్లదని, సమస్యలను అన్నింటిని పరిష్కరిస్తామని ప్రకటించారు సీఎం.