కోలుకుంటున్న వినోద్ కాంబ్లీ
NEWS Dec 26,2024 08:55 am
ముంబైలోని థానే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ భారత క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగు పడింది. మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్ , సునీల్ గవాస్కర్, సచిన్ రమేష్ టెండూల్కర్, అజారుద్దీన్ తో సహా పలువురు క్రికెటర్లు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. కాగా వైద్య ఖర్చులన్నీ తామే భరిస్తామని స్పష్టం చేసింది ఆస్పత్రి యాజమాన్యం. కాంబ్లీని రాష్ట్ర మంత్రి ప్రతాప్ సర్నాయక్ పరామర్శించారు.