బంగాళాఖాతంలో అల్పపీడనం
NEWS Dec 26,2024 06:44 am
నైరుతి బంగాళాఖాతంలో అల్ప పీడనం చోటు చేసుకుంది. ఏపీకి రెండు రోజుల పాటు వర్షాలు రానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, రాగల 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగుతున్నాయని, 28 నుంచి వాతావరణం సాధారణంగా ఉంటుందని తెలిపారు డైరెక్టర్ కూర్మనాథ్.