బెన్‌ఫిట్ షోలు..టికెట్ రేట్ల పెంపు ఉండదు
NEWS Dec 26,2024 06:30 am
సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. టాలీవుడ్ పెద్దలతో సమావేశమైన సీఎం ఇక నుంచి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు తాము వ్యతిరేకం కాదన్నారు. సమస్యల పరిష్కారానికి ముందుంటామని అన్నారు. షూటింగ్‌లకు మరిన్ని రాయితీలు కల్పించాలన్న విజ్ఞప్తిపై కమిటీ వేస్తామన్నారు. ముందస్తు అనుమతులు, తగిన బందోబస్తు ఉంటేనే సినిమా ఈవెంట్లకు అనుమతి ఇస్తామన్నారు.