జనవరి 9న వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు
NEWS Dec 26,2024 04:58 am
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వ దర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టిటిడి ఈవో శ్యామలరావు వెల్లడించారు. మొత్తం 1.20 లక్షల టోకెన్లు భక్తులకు జారీ చేస్తామని, తదుపరి రోజులకు ఏరోజు కారోజు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు.