తిరుమల క్షేత్రం పోటెత్తిన భక్తజనం
NEWS Dec 26,2024 04:35 am
తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారిని 73 వేల 301 మంది భక్తులు దర్శించుకున్నారు. 26 వేల 242 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.14 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో శ్యామల రావు. ప్రస్తుతం భక్తుల క్యూ లైన్ ఎంబీసీ వరకు ఉందని, టోకెన్లు లేని భక్తులకు కనీసం 20 గంటలకు పైగా సమయం పడుతుందని పేర్కొన్నారు.