ఏపీకి నిధులివ్వండి..ఆదుకోండి
NEWS Dec 26,2024 03:53 am
ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కేంద్ర మంత్రులు అమిత్ చంద్ర షా, జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కీలక అంశాల గురించి చర్చించారు. ఏపీ ప్రస్తుతం అప్పుల్లో ఉందని, వెంటనే కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఆదుకోవాలని పీఎంకు విన్నవించారు సీఎం.